సినిమాల్లోకి రావడమనేది నా కూతురు ఇష్టానికే వదిలేశాను: సుమన్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సినిమాల్లోకి రావడమనేది నా కూతురు ఇష్టానికే వదిలేశాను: సుమన్

  • మా అమ్మాయికి యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ లేదు 
  • గ్రాఫిక్స్ పై ఆసక్తి ఉందనిపించింది 
  • ఆమె ఏం చేయాలనుకున్నా నా సపోర్ట్ ఉంటుంది
తెలుగు తెరపై అగ్రస్థానంలో కొనసాగుతోన్న కథానాయకుల సరసన సుమన్ కూడా చోటు సంపాదించుకున్నారు. ఆయనని ఎంతగానో అభిమానించే వారు ఇప్పటికీ వున్నారు. అలాంటి సుమన్ తాజాగా ఐ డ్రీమ్స్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అనేక విషయాలను గురించి ముచ్చటించారు. ఈ నేపథ్యంలోనే "మీ అమ్మాయి చదువు పూర్తయిన తరువాత సినిమాల్లోకి వస్తానంటే మీరు సపోర్ట్ చేస్తారా?" అనే ప్రశ్న ఆయనకి ఎదురైంది.

అందుకు సుమన్ స్పందిస్తూ ... "ఇప్పుడున్న జనరేషన్ కి తమ భవిష్యత్తును నిర్ణయించుకోవడం తెలుసు. ఏం చేస్తే బాగుంటుంది .. ఎలా చేస్తే బాగుంటుంది అనే విషయంలో వాళ్లకి మంచి క్లారిటీ ఉంటోంది. నా కూతురు విషయానికే వస్తే సినిమాల్లోకి రావడం .. రాకపోవడమనేది ఆమె ఛాయిస్ కే వదిలేస్తాను. నాకు తెలిసి తనకి యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ లేదు ..  గ్రాఫిక్స్ విషయంలో ఆసక్తి ఎక్కువగా ఉన్నట్టు అనిపించింది. ఒకవేళ తాను యాక్టింగ్ వైపు రావాలనుకుంటే అది తన ఇష్టమే .. తాను ఏం చేసినా నా సపోర్ట్ ఉంటుంది" అని చెప్పుకొచ్చారు.   
suman

More Telugu News