- జూన్ 11న జయనగర్ నియోజకవర్గంలో ఎన్నిక
- విజయకుమార్ సోదరుడు బీఎన్ ప్రహ్లాద్ పేరు ప్రకటన
- ఈ మేరకు అధిష్ఠానం ఆదేశాలు
ఇటీవల కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సమయంలో జయనగర్ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి బీఎన్ విజయకుమార్ గుండెపోటుతో మృతి చెందిన విషయం తెలిసిందే. దీంతో వాయిదా పడిన ఈ నియోజక వర్గం ఎన్నిక జూన్ 11న
ఎన్నిక
జరగనుంది. ఈ నేపథ్యంలో తమ అభ్యర్థి పేరును
బీజేపీ
అధిష్ఠానం ప్రకటించింది. ఈ స్థానం నుంచి విజయకుమార్ సోదరుడు బీఎన్ ప్రహ్లాద్ పేరును ప్రకటించింది. కాగా, కర్ణాటక సీఎం కుమారస్వామిగౌడ, డిప్యూటీ సీఎంగా పరమేశ్వర్ రేపు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.