మా అమ్మ సావిత్రికి తాగుడు అలవాటు చేసింది నాన్న కాదు: విజయ చాముండేశ్వరి
Add ap7am to your home Screen

మా అమ్మ సావిత్రికి తాగుడు అలవాటు చేసింది నాన్న కాదు: విజయ చాముండేశ్వరి

  • ఆమె చిత్రపరిశ్రమకు చెందిన వారు కనుక మద్యం అలవాటైంది
  • ఈ సినిమాను నేను నా తల్లి కోణంలో చూశాను 
  • మా అక్క  మరో కోణంలో చూసుంటారు!
  • ఈ సినిమా వల్ల నాకు, అక్కకు మధ్య ఎలాంటి విభేదాలు రావు
‘మహానటి’ సినిమాలో చూపించినట్టుగా తన తల్లికి తాగుడు అలవాటు చేసింది తన తండ్రి కాదని.. ఈ విషయాన్ని ఒప్పుకుంటానని జెమినీ గణేశన్-సావిత్రిల కుమార్తె విజయ చాముండేశ్వరి అన్నారు. ఈ సినిమాపై జెమినీ గణేశన్-అలమేలుల కుమార్తె కమల సెల్వరాజ్ చేసిన వ్యాఖ్యలపై విజయ చాముండేశ్వరి స్పందించారు. 

ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, తన తల్లి చిత్రపరిశ్రమకు చెందిన వారు కనుక ఆమెకు మద్యం అలవాటైందని, సినిమాలో నాన్నతో కలిసి అమ్మ మద్యం తాగుతున్నట్టు చూపించారని, ఆమె మద్యం తాగడం అది మొదటిసారేమీ కాదని అన్నారు. ఈ సినిమా వల్ల తనకు, తన అక్క కమలకు మధ్య ఎలాంటి విభేదాలు రావని అభిప్రాయపడ్డారు. 

ఈ సినిమాను తాను తన తల్లి కోణం నుంచి చూశానని, అక్క కమల మరో కోణంలో చూసుంటారని అన్నారు. ఇవి అభిప్రాయభేదాలే తప్ప తన అక్క తప్పేమీ లేదని చెప్పారు. తన తండ్రి నుంచి తనకు దొరికిన అపురూపమైన కానుకలు అక్కాచెల్లెళ్లని, వాళ్లను ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోనని, తమ పెద్దమ్మ అలమేలు గొప్ప మెంటార్ అని, తన తండ్రి కుటుంబమే తన కుటుంబమని చాముండేశ్వరి చెప్పారు.
mahanati
vijay chamudeswari

More Telugu News