అధిష్ఠానం కోసం చేదును మింగాల్సి వస్తోంది: కాంగ్రెస్ నేత డీకే శివకుమార్
- హైకమాండ్ నిర్ణయాన్ని గౌరవిస్తా
- రాజకీయాలలో ఎన్నో ఎత్తులను చిత్తు చేశా
- సంకీర్ణ ప్రభుత్వం ఐదేళ్లపాటు ఉంటుందో, లేదో చెప్పలేను
అధిష్ఠానం కోసం చేదును మింగాల్సి వస్తోందని... అయినా వ్యక్తిగత అభిప్రాయాలకన్నా, సమష్టి నిర్ణయానికే ఎక్కువ విలువ ఉంటుందని శివకుమార్ అన్నారు. హైకమాండ్ నిర్ణయాన్ని గౌరవించడం తన కర్తవ్యమని చెప్పారు. అయితే, ఐదేళ్లపాటు కాంగ్రెస్-జేడీఎస్ ల సంకీర్ణ ప్రభుత్వం కొనసాగుతుందా? లేదా? అనే ప్రశ్నకు తాను సమాధానం చెప్పలేనని అన్నారు. జేడీఎస్ తో కూటమి 2019 లోక్ సభ ఎన్నికల్లో సానుకూలంగానే ఉంటుందని చెప్పారు.