రమణ దీక్షితులుకు మద్దతుగా మాట్లాడిన పవన్ కల్యాణ్!
- పాతికేళ్లు సేవలు చేసిన వ్యక్తి నోటి నుంచి ఆరోపణలు
- నిజానిజాలు తేల్చాల్సిన ప్రభుత్వం ఆ పని చేయట్లేదు
- జనవేన అధినేత పవన్ కల్యాణ్
ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లా పర్యటనలో ఉన్న పవన్ కల్యాణ్, ఈ ఉదయం మీడియాతో మాట్లాడారు. తిరుమలలో టీటీడీ చేస్తున్న అక్రమాలపై భక్తుల్లోనూ అనుమానాలు నెలకొని వున్నాయని, వాటిని నెరవేర్చాల్సిన బాధ్యత చంద్రబాబుదేనని అన్నారు. టీటీడీపై వస్తున్న ఆరోపణలపై నిజానిజాలను నిగ్గు తేల్చాలని పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు.