Andhra Pradesh: చంద్రబాబుపై ఏపీ మాజీ సీఎస్‌ ఐవైఆర్‌ విమర్శలు

షార్ట్స్‌లో చూడండి
తిరుమల తిరుపతి దేవస్థానంలో రాజుకున్న వివాదంపై ఏపీ మాజీ సీఎస్‌ ఐవైఆర్‌ కృష్ణారావు మరోసారి స్పందించారు. సీఎం చంద్రబాబుకు ఈ విషయంపై ఇప్పటికే ఆయన లేఖ రాసిన విషయం తెలిసిందే. ఈ రోజు విజయవాడలో నిర్వహించిన బ్రాహ్మణ సంఘాల ఐక్య వేదిక కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ.. చంద్రబాబు ప్రతి విషయాన్ని రాజకీయ కోణంలోనే చూస్తున్నారని, జీవో 76 అమలు చేస్తున్నామని ప్రభుత్వం లీకులిస్తోందని ఆరోపించారు.

దేవాదాయ చట్టాల గురించి పూర్తిగా తెలుసుకోవడానికి చంద్రబాబుకి సమయం లేకుండా పోయిందన్నారు. ఆయన బ్రాహ్మణులతో బ్రాహ్మణులనే తిట్టించాలనే పాలసీ పెట్టుకున్నారని విమర్శించారు. ఆగమ పరీక్షలో ఉత్తీర్ణుడు కాలేకపోయిన వారిని ప్రధాన అర్చకుడిగా ఎలా నియమిస్తారని నిలదీశారు.      
Go Back to Shorts
Andhra Pradesh
iyr
Chandrababu

More Telugu News