మోదీ నియంతృత్వ పోకడలపై పోరాడుతున్న ఏకైక నాయకుడు చంద్రబాబు: ఏపీ మంత్రి కాల్వ శ్రీనివాసులు

  • రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తున్నారు
  • అన్ని రాష్ట్రాలను మోదీ సమానంగా చూడాలి
  • కర్ణాటక సంఘటనతో మోదీ తన తీరు మార్చుకోవాలి
ప్రధాని మోదీ నియంతృత్వ పోకడలపై పోరాడుతున్న ఏకైక నాయకుడు చంద్రబాబేనని ఏపీ మంత్రి కాల్వ శ్రీనివాసులు అన్నారు. అనంతపురం జిల్లాలోని శింగనమల నియోజకవర్గ మినీమహానాడు కార్యక్రమం ఈ రోజు ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కాల్వ శ్రీనివాసులు మాట్లాడుతూ, కేంద్రం నుంచి ఏమాత్రం సహకారం లేకపోయినప్పటికీ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తున్న నాయకుడు చంద్రబాబు అని ప్రశంసించారు.

ప్రధాని మోదీ ఇప్పటికైనా అన్ని రాష్ట్రాలను సమానంగా చూడాలని, కర్ణాటక సంఘటనను చూసైనా మోదీ తన తీరు మార్చుకోవాలని హితవు పలికారు. కాగా, ప్రభుత్వ విప్ యామినీబాల మాట్లాడుతూ, ప్రజల సంతోషం కోసం టీడీపీ ప్రభుత్వం పనిచేస్తోందని, చంద్రబాబును మళ్లీ ముఖ్యమంత్రిని చేసేందుకు కార్యకర్తలంతా సిద్ధంగా ఉండాలని పిలుపు నిచ్చారు.
Go Back to Shorts
Telugudesam
kalva srinivas

More Telugu News