నేను పుట్టింది చంపడానికే .. తరగతి గదిలో తోటి విద్యార్థులను కాల్చిన నిందితుడి మాటలివి!

  • నిందితుడి ఫేస్‌బుక్, జర్నల్ నిండా ఇటువంటి వ్యాఖ్యలే
  • తోటి విద్యార్థులను చంపి చనిపోవాలనుకున్న నిందితుడు
  • శుక్రవారం జరిగిన ఘటనలో 10 మంది విద్యార్థుల మృతి
హోస్టన్ సమీపంలోని శాంటా ఫేలో ఓ హైస్కూల్‌లో ఆర్ట్ క్లాస్ విద్యార్థి మారణహోమం సృష్టించిన టెక్సాస్ టీనేజర్ డిమిట్రియోస్ తాను పుట్టింది చంపడానికేనని బలంగా నమ్మేవాడు. అతడి ఫేస్‌బుక్, అతడి మాటలను జాగ్రత్తగా గమనించిన వారికి ఈ విషయాలు అర్థమవుతాయి. శుక్రవారం క్లాసు రూములో కాల్పులకు తెగబడిన డిమిట్రియోస్ పదిమందిని పొట్టనపెట్టుకున్నాడు.

మొదట చంపి తర్వాత చనిపోవాలని ఆ టీనేజర్ నిర్ణయించుకున్నట్టు అతడి సోషల్ మీడియా ఖాతాలు, జర్నల్ ఎంట్రీల ద్వారా తెలుస్తోందని గవర్నర్ గ్రెగ్ అబాట్ తెలిపారు. ఏప్రిల్ 30న 17 ఏళ్ల డిమిట్రియోస్ తన ఫేస్‌బుక్ ఖాతాలో ఓ ఫొటోను పోస్టు చేశాడు. బ్లాక్ టీ షర్టుపై ‘బార్న్ టు కిల్’ అని తెల్లని అక్షరాలతో దానిపై రాసి ఉంది. విద్యార్థులను కాల్చడం మాత్రమే కాదని, కాల్చిన తర్వాత తాను ఆత్మహత్య చేసుకోవాలని నిందితుడు భావించాడని అబాట్ మీడియాకు తెలిపారు. డిమిట్రియోస్ వ్యక్తిగత జర్నల్స్‌‌లో ఈ విషయాన్ని పేర్కొన్నాడని, వాటిని ప్రస్తుతం పోలీసులు సీజ్ చేశారని గవర్నర్ అబాట్ పేర్కొన్నారు.  
Go Back to Shorts
America
texas
Class room
shooting

More Telugu News