nikhil: నిఖిల్ హీరోగా యాక్షన్ ఎంటర్టైనర్ .. ఆశలు పెట్టుకున్న లావణ్య త్రిపాఠి

షార్ట్స్‌లో చూడండి
తెలుగులో వరుస విజయాలను సొంతం చేసుకుంటూ వస్తోన్న యువ కథానాయకులలో నిఖిల్ ముందు వరుసలో కనిపిస్తున్నాడు. 'కిరాక్ పార్టీ' సినిమాతో హిట్ కొట్టిన ఆయన, తన తాజా చిత్రాన్ని టి.ఎన్. సంతోష్ దర్శకత్వంలో చేస్తున్నాడు. యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా రూపొందుతోంది. ఈ సినిమాలో నిఖిల్ జోడీగా లావణ్యత్రిపాఠి నటిస్తోంది.

వేణుగోపాల్ .. రాజ్ కుమార్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ సినిమాకి, శామ్ సి.ఎస్. స్వరాలను సమకూర్చుతున్నాడు. ఈ మధ్య కాలంలో కొన్ని తమిళ సినిమాలకి ఆయన అందించిన సంగీతానికి మంచి పేరు వచ్చింది. అందువలన ఆయనతో ఈ సినిమాకి బాణీలు కట్టిస్తున్నారు. ఇక ఇటీవల కాలంలో లావణ్య త్రిపాఠికి సక్సెస్ లు కరువై, రేసులో వెనుకబడిపోయింది. అందువలన ఈ సినిమా తనకి తప్పకుండా హెల్ప్ కావాలని ఆమె కోరుకుంటోంది .. అవుతుందని ఆశిస్తోంది.  
Go Back to Shorts
nikhil
lavanya

More Telugu News