ఒక్క కాంగ్రెస్ ఎమ్మెల్యే కూడా బీజేపీతో లేరు: మధు యాష్కీ

  • కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమతో ఉన్నారన్న అమిత్ షా
  • అమిత్ షా వ్యాఖ్యల్లో వాస్తవం లేదన్న మధు యాష్కీ
  • కర్ణాటక అసెంబ్లీలో రేపే బలపరీక్ష
కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమతో ఉన్నారంటూ బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా చేసిన వ్యాఖ్యలను తెలంగాణ కాంగ్రెస్ నేత మధు యాష్కీ తప్పుబట్టారు. అమిత్ షా వ్యాఖ్యలు అవాస్తవమని చెప్పారు. మొత్తం కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా తమతోనే ఉన్నారని తెలిపారు. మెజార్టీ లేని బీజేపీ ఏ విధంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ప్రశ్నించారు. బలపరీక్షలో యడ్యూరప్ప ఓడిపోవడం ఖాయమని చెప్పారు. రేపు సాయంత్రం 4 గంటలకు కర్ణాటక అసెంబ్లీలో బలపరీక్షను ఎదుర్కోవాలంటూ బీజేపీని సుప్రీంకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. 
Go Back to Shorts
amit shah
Madhu Yaskhi
karnataka
floor test

More Telugu News