తమ్ముడి కోసం యువతిని కిడ్నాప్ చేసిన బుల్లితెర నటి అంజలి... పోలీసులకు ఫిర్యాదు!
- ఎస్సార్ నగర్ పోలీసులకు ఫిర్యాదు
- కొంతకాలంగా ప్రేమించుకుంటున్న వెంకటేశ్, దివ్య
- వెంకటేశ్ సోదరి కిడ్నాప్ చేయించిందన్న దివ్య అమ్మ, నాన్న
ఇక రెండు రోజుల క్రితం దివ్య ఇంటి నుంచి వెళ్లిపోగా, తన కుమార్తెను వెంకటేష్ సోదరి, నటి అంజలి కిడ్నాప్ చేసిందని వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమెను తన సోదరుడు వెంకటేశ్ కు ఇచ్చి వివాహం చేయాలన్నది ఆమె ఆలోచనని ఆరోపించారు. తమ కుమార్తెను తమకు అప్పగించాలని వారు కోరారు. వారు కేసు పెట్టిన మరుసటి రోజే వెంకటేశ్, దివ్య ఆర్యసమాజ్ లో వివాహం చేసుకోవడం గమనార్హం.