vishal: తమిళ 'టెంపర్'లో విశాల్ .. క్లైమాక్స్ లో మార్పు

షార్ట్స్‌లో చూడండి
తెలుగులో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన 'టెంపర్' యూత్ ను .. మాస్ ఆడియన్స్ ను ఒక రేంజ్ లో ఆకట్టుకుంది. అప్పటి వరకూ కొన్ని పరాజయాలను ఎదుర్కొన్న ఎన్టీఆర్, ఈ సినిమా నుంచే వరుస విజయాలను అందుకుంటూ వెళుతున్నాడు. 'టెంపర్' కథ .. ట్రీట్మెంట్ ఇతర భాషల్లోని హీరోలను సైతం ఆకర్షించాయి. దాంతో వాళ్లంతా ఈ కథను రీమేక్ చేయడానికి ఆసక్తిని చూపుతున్నారు.

అలా తమిళంలో ఈ సినిమా రీమేక్ లో చేయడానికి విశాల్ రంగంలోకి దిగాడు. ఈ రీమేక్ కి సంబంధించిన సన్నాహాలు మొదలైపోయాయి. ఈ కథలోని పాయింట్ ను మరింత బలంగా చెప్పాల్సిన అవసరం ఉందని విశాల్ భావించాడట. అందుకే కొన్ని సన్నివేశాలతో పాటు .. క్లైమాక్స్ ను కూడా మార్చాలని నిర్ణయించుకున్నాడట. మరి విశాల్ చేస్తోన్న ఈ మార్పులు .. అక్కడి ఆడియన్స్ ను ఎంతవరకూ మెప్పిస్తాయో చూడాలి.   
Go Back to Shorts
vishal

More Telugu News