టీడీపీ కార్యకర్తల్లోని సుగుణాన్ని బయటపెట్టిన చంద్రబాబు!
- పోలింగ్ బూత్ దగ్గర నిల్చునేది కార్యకర్తలే
- సొంత డబ్బుతో పనిచేసే కార్యకర్తలు టీడీపీ సొంతం
- కొన్ని రోజులు అలిగినా, మళ్లీ ఒక్కతాటిపైకి వస్తారు
పోలింగ్ బూత్ దగ్గర అధికారులు నిలబడరని, కార్యకర్త మాత్రమే నిలబడతాడన్న సంగతిని గుర్తు పెట్టుకోవాలని నేతలకు సూచించారు. 90 శాతం కార్యకర్తలు కోరుకునేది గౌరవమేనని, వారికి అది దక్కేలా చూడాలని అన్నారు. ఓ గడువు పెట్టుకుని ఆ లోపు కార్యకర్తలతో సత్సంబంధాలను పెంచుకోవాలని ఆదేశించారు. తాను కూడా ఇకపై పార్టీ కోసం ఎక్కువ సమయం కేటాయిస్తానని పేర్కొన్నారు. అందరం సమష్టిగా పనిచేసి వచ్చే ఎన్నికల్లో టీడీపీ విజయానికి కృషి చేద్దామని అన్నారు.