'సీఎండీ' పదవిని విడదీయండి... సెబీ కీలక ఆదేశాలు!
- చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్లు విడివిడిగా ఉండాలి
- ఏప్రిల్ 2020లోగా విడదీయాల్సిందే
- స్వతంత్ర డైరెక్టర్లలో ఓ మహిళ తప్పనిసరి
- రిజిస్టర్డ్ కంపెనీలకు సెబీ ఆదేశాలు
ఇండియాలో కార్పొరేట్ పరిపాలనలో తీసుకురావాల్సిన మార్పులపై ఏర్పాటైన ఉదయ్ కోటక్ ప్యానల్ 80 సిఫార్సులు చేయగా, వాటిల్లో 40 సిఫార్సులకు సెబీ ఓకే చెప్పింది. ఇక కంపెనీలు, వాటి అనుబంధ సంస్థల్లో సెక్రటేరియల్ ఆడిట్ తప్పనిసరని, టాప్ 100 సంస్థలు తమ యాన్యువల్ జనరల్ బాడీ మీటింగ్ (వార్షిక సర్వసభ్య సమావేశం - ఏజీఎం)లను వెబ్ కాస్టింగ్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయాలని ఆదేశించింది. చేపట్టిన మార్పుల్లో అత్యధికం 2019 ఏప్రిల్ నుంచి 2020 ఏప్రిల్ లోగా అమలులోకి వస్తాయని సెబీ తన తాజా నోటిఫికేషన్ లో పేర్కొంది.