రైలు ప్రమాదాల బాధితులకు పరిహారం చెల్లించాల్సిందే... సుప్రీంకోర్టు సంచలన తీర్పు!
- 'ప్రయాణికుల నిర్లక్ష్యం' అంటే కుదరదు
- నష్ట పరిహారం చెల్లించాల్సిందే
- తీర్పిచ్చిన ఏకే గోయల్, ఆర్ఎఫ్ నారిమన్ ల ధర్మాసనం
ప్రమాదాల బాధితులు రైల్వే శాఖ నుంచి నష్టపరిహారం పొందేందుకు అర్హులని తేల్చింది. రైల్వే చట్టం 1989లోని సెక్షన్ 124 ఏ ప్రకారం బాధితులకు నష్టపరిహారాన్ని రైల్వే శాఖ చెల్లించాల్సి వున్నప్పటికీ, పలు సందర్భాల్లో ప్రయాణికుల నిర్లక్ష్యాన్ని రైల్వే శాఖ హైలైట్ చేస్తూ పరిహారం ఇవ్వకుండా తప్పించుకుంటుండగా, రైలు ప్రమాద కేసుల్లో హైకోర్టులు వివిధ రకాల తీర్పులను ఇస్తున్నాయి. ఇకపై ప్రమాదాలు జరిగితే పరిహారం రైల్వే శాఖ చెల్లించాల్సిందేనని సుప్రీం తీర్పు ఆదేశించింది.