కర్ణాటక ఎన్నికలు దేశ ప్రజలందరికీ చాలా కీలకం: కాంగ్రెస్ నేత చిదంబరం
- దేశ ప్రజల ఆశలు, ఆకాంక్షలన్నీ కర్ణాటక ఓటర్ల తీర్పుపైనే
- సిద్ధరామయ్య పాలనలో రాష్ట్రం అభివృద్ధి సాధించింది
- 2008 నుంచి 2013 మధ్య కాలంలో ముగ్గురు సీఎంలను మార్చిన ఘనత బీజేపీదే
సిద్ధరామయ్య పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించిందని, తలసరి ఆదాయం పెరిగిందని చెప్పారు. 2008 నుంచి 2013 మధ్య సంవత్సరాలలో ముగ్గురు సీఎంలను మార్చిన ఘనత బీజేపీదేనని, కర్ణాటక చరిత్రలో అత్యంత చెత్త ప్రభుత్వం బహుశా ఇదేనని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. బీజేపీ-ఆర్ఎస్ఎస్ కలిసి రాష్ట్రాలను బలహీన పరిచే ఎత్తుగడలు వేస్తున్నాయని ఆరోపించారు.