ఈ ట్వీట్ పెడుతుంటే కన్నీరు ఆగడం లేదు: హీరో విశాల్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఈ ట్వీట్ పెడుతుంటే కన్నీరు ఆగడం లేదు: హీరో విశాల్

  • నిన్న మృతి చెందిన నిర్మాత గోపాల్ రెడ్డి కుమారుడు
  • సొంత సోదరుడిని కోల్పోయానన్న విశాల్
  • ఇంత బాధకు ఎప్పుడూ గురి కాలేదంటూ ఆవేదన
భార్గవ్ ఆర్ట్ ప్రొడక్షన్స్ అధినేత, దివంగత నిర్మాత ఎస్.గోపాల్ రెడ్డి కుమారుడు భార్గవ్ నిన్న మృతి చెందిన సంగతి తెలిసిందే. నెల్లూరు జిల్లాలో సముద్రంలో పడిపోయి ఆయన దుర్మరణం పాలయ్యారు. ఈ విషాద ఘటనపై హీరో విశాల్ ట్విట్టర్ ద్వారా స్పందించాడు.

"సొంత సోదరుడిని కోల్పోయా. ఇంత బాధకు ఎప్పుడూ గురి కాలేదు. నీ సమస్య గురించి కూడా నేను పట్టించుకోవాల్సింది. నీ జీవితానికి నువ్వే ముగింపు పలికి ఉంటావని అనుకోను. నిన్ను మిస్ అయ్యానని ట్విట్టర్ ద్వారా చెప్పాలనిపించింది. ఈ మెసేజ్ పెడుతుంటే కన్నీరు ఆగడం లేదు" అంటూ ట్వీట్ చేశాడు. 
vishal
bhargav
s gopal reddy

More Telugu News