vijay devarakonda: విజయ్ దేవరకొండ నెక్స్ట్ మూవీగా 'డియర్ కామ్రేడ్'

షార్ట్స్‌లో చూడండి
విజయ్ దేవరకొండ చేతిలో అరడజనుకు పైగా సినిమాలు వున్నాయి. వాటిని వరుసగా పూర్తిచేసే పనిలో ఆయన బిజీగా వున్నాడు. ఆయన ముఖ్యమైన పాత్రను పోషించిన 'మహానటి' రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా తరువాత 'టాక్సీవాలా'ను విడుదలకి సిద్ధం చేస్తున్నాడు. ఇక పరశురామ్ దర్శకత్వంలో చేస్తోన్న సినిమా కూడా చిత్రీకరణను పూర్తి చేసుకుంటోంది.

ఈ నేపథ్యంలో ముందుగా ప్లాన్ చేసుకున్న ప్రకారమే భరత్ కమ్మ అనే దర్శకుడితో కలిసి త్వరలో సెట్స్ పైకి వెళ్లడానికి రెడీ అవుతున్నాడు. ఈ సినిమాకి 'డియర్ కామ్రేడ్' అనే టైటిల్ ను ఖరారు చేశారు. టైటిల్ తోనే ఈ సినిమా ఆసక్తిని రేకెత్తిస్తోందని చెప్పొచ్చు. ఈ సినిమా కోసం కొత్త అమ్మాయిని కథానాయికగా తీసుకోనున్నట్టు సమాచారం. 'అర్జున్ రెడ్డి' సినిమాలో పాత్ర మేరకు తెలంగాణ యాసలో మాట్లాడిన విజయ్ దేవరకొండ, ఈ సినిమాలో ఆంధ్రలోని ఒక ప్రాంతానికి చెందిన యాసను మాట్లాడనున్నట్టు తెలుస్తోంది.     
Go Back to Shorts
vijay devarakonda

More Telugu News