బరితెగించిన మహిళ ఎవరైనా ఉన్నారంటే రోజానే!: టీడీపీ ఎమ్మెల్యే బండారు కటువు వ్యాఖ్యలు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

బరితెగించిన మహిళ ఎవరైనా ఉన్నారంటే రోజానే!: టీడీపీ ఎమ్మెల్యే బండారు కటువు వ్యాఖ్యలు

  • విశాఖకు జోన్ కోసం దీక్ష చేసిన అవంతి శ్రీనివాస్
  • మహిళనని చెప్పుకునే అర్హత రోజాకు లేదు
  • సభ్యత, సంస్కారంలేని మహిళ రోజా
ఇండియాలోనే అత్యంత బరితెగించిన మహిళ వైసీపీ ఎమ్మెల్యే రోజా అని, తెలుగుదేశం ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ కటువు వ్యాఖ్యలు చేశారు. విశాఖకు రైల్వే జోన్ డిమాండ్ చేస్తూ ఎంపీ అవంతి శ్రీనివాస్, ఒక రోజు దీక్షకు దిగిన వేళ, ఆయనకు మద్దతుగా బండారు సత్యనారాయణ వచ్చారు. ఆపై మీడియాతో మాట్లాడుతూ, తాను ఓ మహిళనని రోజాకు చెప్పుకునే అర్హతే లేదని వ్యాఖ్యానించిన బండారు, ఆమెకు సభ్యత, సంస్కారం లేవని అన్నారు.

రోజా ముందు భాషను నేర్చుకోవాలని హితవు పలికారు. బజారు భాషను ఆమె మాట్లాడుతోందని, రెడ్ లైట్ ఏరియాల్లో ఉన్న వారు కూడా ఆ విధంగా మాట్లాడరని వ్యాఖ్యానించారు. తనను ఆరే, ఒరే అని రోజా సంబోధిస్తుండటాన్ని ప్రస్తావిస్తూ, తాను రోజాను ఓ సోదరి మాదిరే భావిస్తున్నానని, అయినా ఆమె తన నోటికొచ్చినట్టు మాట్లాడుతోందని నిప్పులు చెరిగారు.
Roja
Bandaru
Vizag
Avanti Srinivas

More Telugu News