తెలంగాణ రాజకీయ నేతలు, అధికారులు ఉన్న వాట్స్ యాప్ గ్రూప్ లో అశ్లీల ఫొటోలు!

  • శ్రీకాంతాచారి అభిమాన సంఘం పేరిట గ్రూప్
  • అశ్లీల ఫొటోలు పోస్టు చేసిన అజ్ఞాత వ్యక్తి
  • పోలీసులకు ఫిర్యాదు చేసిన అడ్మిన్
ప్రత్యేక తెలంగాణ కావాలంటూ ఉస్మానియా యూనివర్శిటీలో వేలాది మంది చూస్తుండగా, ఆత్మబలిదానం చేసిన శ్రీకాంతాచారి అభిమాన సంఘం వాట్స్ యాప్ గ్రూప్ అది. దీనిలో తెలంగాణ రాజకీయ నేతలు, ఉన్నతాధికారులు ఎందరో సభ్యులుగా ఉన్నారు. ఈ గ్రూప్ లో ఓ అజ్ఞాతవ్యక్తి అశ్లీల ఫొటోలను పోస్టు చేయడం కలకలం రేపింది. ఆ ఫొటోలతో తమకు సంబంధం లేదని చెబుతున్న గ్రూప్ అడ్మిన్, అశ్లీల ఫొటోలు పోస్టు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని చెబుతూ పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు, ఫొటోలు పెట్టిన వ్యక్తిని గుర్తించేందుకు చర్యలు చేపట్టారు.
Go Back to Shorts
Hyderabad
whats app
Admin
Srikantachari

More Telugu News