Nagarjuna: నాగార్జున కొత్త సినిమా రెండో టీజర్ విడుదల

షార్ట్స్‌లో చూడండి
నాగార్జున, రామ్‌ గోపాల్‌ వర్మ కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటోన్న ఆఫీసర్‌ సినిమాకు సంబంధించి రెండో టీజర్‌ను ఈ రోజు ఆ సినిమా బృందం విడుదల చేసింది. ‘పాలిటిక్స్‌... మాఫియాల్లో బయటకు కనిపించేవి నిజం కావు’ అంటూ విలన్‌ హెచ్చరిక చేస్తోన్న ఓ డైలాగును ఇందులో వినిపించారు. ‘ప్రతి మనిషిలోనూ దేవుడు, రాక్షసుడు ఉంటారు’ అని నాగార్జున ఓ డైలాగు కొట్టాడు.

‘నువ్వు నన్ను నమ్ముతావా’ అని నాగార్జున అడగగా.. ‘మీకన్నా ఎక్కువగా’ అంటూ ఓ పాప పలికే డైలాగును కూడా ఇందులో వినిపించారు. కాగా, ఈ సినిమా ట్రైలర్‌ను ఈ నెల 12న విడుదల చేయనున్నారు. ఆఫీసర్‌ సినిమా ఈ నెల 25న విడుదల కానుంది. కంపెనీ పతాకంపై రామ్‌గోపాల్‌వర్మ, సుధీర్‌ చంద్ర ఈ సినిమాను నిర్మిస్తున్నారు.                   
Go Back to Shorts
Nagarjuna
RGV
Tollywood

More Telugu News