అందుకే జయలలితకు స్పీకర్ రోల్ ఇచ్చాను: కొరటాల శివ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అందుకే జయలలితకు స్పీకర్ రోల్ ఇచ్చాను: కొరటాల శివ

  • జయలలిత చాలా హుందాగా కనిపిస్తారు
  • మహేశ్ నా నిర్ణయానికి వదిలేశారు 
  • నా ఆలోచన సరైనదేనని మా టీమ్ చెప్పింది  
కొరటాల శివ దర్శకత్వం వహించిన 'భరత్ అనే నేను' భారీ విజయాన్ని అందుకుంది. ఇటు కొరటాల .. అటు మహేశ్ బాబు కెరియర్లో చెప్పుకోదగిన సినిమాగా నిలిచింది. ఈ నేపథ్యంలో కొరటాల శివ ఐ డ్రీమ్స్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. "స్పీకర్ పాత్రకి జయలలితను తీసుకోవడం ఒక సాహసమేనని చెప్పాలి. ఆమెనే ఎంపిక చేయడానికి గల కారణం ఏమిటి?" అనే ప్రశ్న ఆయనకి ఎదురైంది.

అందుకాయన తనదైన శైలిలో స్పందిస్తూ .. "జయలలితగారు నాకు చాలా హుందాగా కనిపిస్తారు. గతంలో ఆమె చేసిన కొన్ని సీరియల్స్ చూశాను .. గౌరవంగా ఆమె మాట్లాడే తీరు గురించి తెలుసు .. ఆమె చాలా హుందాగా అనిపిస్తారు. అందువలన ఈవిడైతే స్పీకర్ గా బాగుంటుంది అనిపించింది. అదే విషయాన్ని మహేశ్ బాబుకి చెబితే ..నా ఇష్టానికే ఆయన వదిలేశారు. మా టీమ్ నా నిర్ణయం సరైనదేనని అన్నారు. సెట్లోని స్పీకర్ చైర్లో ఆమె కూర్చున్న తరువాత నాకు సంతృప్తికరంగా అనిపించింది" అని చెప్పుకొచ్చారు.
koratala
Mahesh Babu

More Telugu News