Balakrishna: ‘మా’ నుంచి బాలకృష్ణను సస్పెండ్ చేయాలి: బీజేపీ సినిమా సెల్ డిమాండ్

షార్ట్స్‌లో చూడండి
ప్రముఖ సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణను మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) నుంచి సస్పెండ్ చేయాలని బీజేపీ తెలంగాణ రాష్ట్ర సినిమా సెల్ డిమాండ్ చేసింది. ప్రధాని నరేంద్రమోదీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆయనను ‘మా’ నుంచి తొలగించేలా చర్యలు తీసుకోవాలని కోరింది. అలాగే ప్రధానిపై తీవ్ర వ్యాఖ్యలు చేసినందుకు బాలకృష్ణపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని బీజేపీ సినిమా సెల్ నిర్ణయించినట్టు సెల్ కన్వీనర్ సీవీఎల్ నరసింహారావు తెలిపారు. అలాగే,  ఫిల్మ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌కు బకాయి పడిన మొత్తాన్ని ఎన్టీఆర్ స్టూడియో నుంచి రాబట్టాలని, లేదంటే జప్తు చేయాలని నరసింహారావు డిమాండ్ చేశారు.
Go Back to Shorts
Balakrishna
Tollywood
Narendra Modi
BJP

More Telugu News