మిస్టర్ కూల్ ఖాతాలో మరో రికార్డు.. ఐపీఎల్‌లో ధోనీ అరుదైన ఘనత!

  • 150 మ్యాచ్‌లకు సారథ్యం వహించిన ఒకే ఒక్కడు
  • ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌తో అరుదైన ఘనత
  • మొత్తం 88 విజయాలతో అందరికంటే ముందు
టీమిండియా మాజీ సారథి, చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ ఖాతాలోకి మరో రికార్డు వచ్చి చేరింది. ఐపీఎల్‌లో 150 మ్యాచ్‌లకు కెప్టెన్సీ వహించిన ఏకైక ఆటగాడిగా ధోనీ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. శనివారం పుణెలో ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌తో ఈ రికార్డు సొంతమైంది. మొత్తం 150 మ్యాచ్‌లకు సారథ్య బాధ్యతలు నిర్వర్తించిన ధోనీ 88 విజయాలు సాధించాడు. 59.45 శాతం విజయాలతో ఐపీఎల్‌లో మిగతా కెప్టెన్ల కంటే ముందున్నాడు.

ఆదివారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ధోనీ సేన వరుస విజయాలకు చెక్ పడింది. తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేయగా, అనంతరం బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ మరో రెండు బంతులు మిగిలి ఉండగానే నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి విజయం సాధించింది.
Go Back to Shorts
MS Dhoni
Chennai super kings
IPL

More Telugu News