KTR: కేటీఆర్‌ గారూ.. మహేశ్‌ బాబు కొత్త సినిమాకు ప్రమోషన్ ఇచ్చారు.. ప్లీజ్‌ మా బాధ కూడా వినిపించుకోండి: శ్రీరెడ్డి

షార్ట్స్‌లో చూడండి
తెలంగాణ మంత్రి కేటీఆర్‌కి యువనటి శ్రీరెడ్డి మరోసారి సోషల్ మీడియా ద్వారా తన విన్నపాన్ని తెలిపింది. తాము ఇప్పటికే మూడు, నాలుగు సార్లు ట్వీట్లు చేశానని మరోసారి చేస్తున్నానని తెలిపింది. కొన్ని నెలలుగా తాము క్యాస్టింగ్ కౌచ్‌పై పోరాడుతున్నామని, తమకు న్యాయం కావాలని, ప్లీజ్‌ సర్‌ అని ఆమె ఫేస్‌బుక్‌లో పేర్కొంది. సినీ పరిశ్రమకు సంబంధించిన పెద్ద కుటుంబాలు తమ సమస్యలపై సరైన రీతిలో స్పందించడం లేదని, వారు తీసుకున్న నిర్ణయాలపై తాము సంతృప్తి చెందడం లేదని శ్రీరెడ్డి తెలిపింది.

తెలుగు మహిళలు, యువతులకు సినిమాల్లో ఆఫర్లు రావడం లేదని, తాము కేటీఆర్‌ను కలవాలనుకుంటున్నామని చెప్పింది. మహేశ్‌ బాబు తాజా సినిమా 'భరత్ అనే నేను'కు కేటీఆర్‌ ప్రమోషన్లు ఇచ్చారని, కానీ సినీ పరిశ్రమలో మహిళల సమస్యలపై స్పందించేందుకు సమయం ఎందుకు కేటాయించడం లేదని శ్రీరెడ్డి ప్రశ్నించింది. తాను కేటీఆర్‌ పీఏ మొబైల్‌కి పలుసార్లు మెస్సేజ్‌లు చేశానని, కానీ స్పందన రాలేదని, తమ సమస్యలకు పరిష్కారం చూపిస్తామని చెప్పాలని డిమాండ్ చేసింది. 
Go Back to Shorts
KTR
sri reddy
Tollywood

More Telugu News