డౌట్ లేదు .. మహేశ్ తో సినిమా వుంది: సందీప్ రెడ్డి వంగ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

డౌట్ లేదు .. మహేశ్ తో సినిమా వుంది: సందీప్ రెడ్డి వంగ

  • మహేశ్ కోసం కథ సిద్ధం చేశాను 
  • ఇటీవలే ఆ కథ వినిపించాను
  • త్వరలో పూర్తి స్క్రిప్ట్ రెడీ చేస్తాను
'అర్జున్ రెడ్డి' సినిమా ఎంతటి సంచలన విజయం సాధించిందో తెలిసిందే. ఈ సినిమా వివిధ భాషల్లో రీమేక్ అవుతోంది. హిందీలోను ఈ సినిమాకి సందీప్ రెడ్డి వంగ దర్శకత్వం వహించనున్నాడు. ఆయన మహేశ్ తో ఒక సినిమా చేయనున్నట్టు కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. తాజాగా ఆ టాక్ గురించి సందీప్ రెడ్డి స్పందించాడు.

 " నిజంగానే నేను మహేశ్ బాబుతో ఒక సినిమా చేయనున్నాను. ఇటీవలే మహేశ్ ను కలిసి కథను వినిపించడం జరిగింది. మంచి వాతావరణంలో మా ఇద్దరి మధ్య కథా చర్చలు జరిగాయి. 'అర్జున్ రెడ్డి' హిందీ రీమేక్ ను పూర్తిచేసిన తరువాత, మహేశ్ మూవీకి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ మొదలుపెడతాను" అని చెప్పుకొచ్చాడు. ఈ లోగా వంశీ పైడిపల్లితోను .. సుకుమార్ తోను మహేశ్ లాగించేస్తాడు. మొత్తానికి మహేష్.. సందీప్ రెడ్డి వంగ ప్రాజెక్టు వచ్చే ఏడాది సెట్స్ పైకి వెళ్లడం ఖాయమైపోయిందన్న మాట.  
Mahesh Babu
sandeep reddy

More Telugu News