'టాక్సీవాలా' ఆ యంగ్ హీరో చేయాల్సిందట!
Add ap7am to your home Screen

'టాక్సీవాలా' ఆ యంగ్ హీరో చేయాల్సిందట!

  • 'టాక్సీవాలా'గా విజయ్ దేవరకొండ
  • దెయ్యం నేపథ్యంలో సినిమా 
  • వచ్చేనెల 18వ తేదీన విడుదల      
సాధారణంగా ఒక హీరో చేయవలసిన సినిమాను కొన్ని కారణాల వలన మరో హీరో చేయడం జరుగుతూ ఉంటుంది. ఒక హీరో వదులుకున్న కారణంగా ఆ సినిమాను మరో హీరో చేసిన సందర్భాలు కూడా కనిపిస్తూ ఉంటాయి. అలా రాజ్ తరుణ్ వదులుకున్న 'టాక్సీవాలా'ను విజయ్ దేవరకొండ చేసినట్టుగా చెబుతున్నారు.

శరీరం నుంచి ఆత్మ వేరుగా వెళ్లి రావడం ..  కారులో దెయ్యం అనే అంశాలు రాజ్ తరుణ్ ను ఆలోచనలో పడేశాయట. ఈ రెండు అంశాలతో గతంలో కొన్ని సినిమాలు రావడం వలన ఆయన ఆసక్తిని చూపించలేదట. దాంతో ఈ కథ విజయ్ దేవరకొండ దగ్గరికి వెళ్లగా ఆయన ఓకే చేశాడని అంటున్నారు. వచ్చేనెల 18వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా హిట్ కొడితే .. రాజ్ తరుణ్ ఒక సక్సెస్ ను మిస్ అయినట్టే అవుతుంది.      
vijay devarakonda

More Telugu News