బీసీలమని మన గురించి మనం చెప్పుకోవడానికి సిగ్గెందుకు?: సినీ నటుడు సుమన్
- బీసీలమని చెప్పుకునేందుకు కొందరు సిగ్గుపడుతున్నారు
- బీసీలని చెప్పుకునేందుకు గర్వపడాలి
- బీసీలు లేకుండా ఏ పార్టీ మనుగడ సాగించలేదు
బీసీలు లేకుండా, బీసీల ఓట్లు లేకుండా ఏ రాజకీయ పార్టీ కూడా మనుగడ సాగించలేదని అన్నారు. తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో హైదరాబాదులో జరిగిన కార్యక్రమంలో ప్రసంగిస్తూ, సుమన్ ఈ విధంగా వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమానికి నటుడు ఆర్.నారాయణమూర్తి, దర్శకుడు శంకర్ తదితరులు హాజరయ్యారు.