ప్రభాస్ కి గల క్రేజ్ ను చూసి షాక్ అయ్యాము: హీరో నిఖిల్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ప్రభాస్ కి గల క్రేజ్ ను చూసి షాక్ అయ్యాము: హీరో నిఖిల్

  • సాంగ్ షూటింగ్ కోసం అక్కడికి వెళ్లాము 
  • అక్కడి ఆర్మీ అధికారులు అడ్డుకున్నారు 
  • ఆ తరువాత అనుమతినిచ్చారు
తెలుగు తెరపై మంచి జోరుమీదున్న యువ కథానాయకులలో నిఖిల్ ఒకరుగా కనిపిస్తాడు. ప్రస్తుతం ఆయన ఠాగూర్ మధు నిర్మాణంలో .. సంతోష్ దర్శకత్వంలో 'ముద్ర' సినిమా చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో 'కిరాక్ పార్టీ' షూటింగ్ సమయంలో జరిగిన ఒక సంఘటనను గురించి నిఖిల్ ప్రస్తావించాడు. " ఈ సినిమాలో 'ప్రాణమంతా .. ' అనే సాంగ్ షూటింగు కోసం మేమంతా 'గంగోత్రి' జలపాతం దగ్గరికి చేరుకున్నాం"

"అక్కడి ఆర్మీ అధికారులు షూటింగ్ చేయడానికి వీల్లేదంటూ మమ్మల్ని అడ్డుకున్నారు. అప్పుడు నేను వాళ్లను రిక్వెస్ట్ చేయడానికి ప్రయత్నిస్తూ ..  'హైదరాబాద్ నుంచి వచ్చాం సార్' అన్నాను. అంతే.. వాళ్ల ఎక్స్ ప్రెషన్స్ మారిపోయాయి .. మీరు ప్రభాస్ సొంత ఊరు నుంచి వచ్చారా? అయితే షూటింగ్ చేసుకోండి .. అంటూ అనుమతిని ఇచ్చారు. అంతేకాదు మాకు వాటర్ బాటిల్స్ .. ఫుడ్ తెప్పించారు. ప్రభాస్ కి గల క్రేజ్ ఏ స్థాయిలో ఉందనేది అప్పుడే మాకు తెలిసింది" అంటూ చెప్పుకొచ్చాడు.   
nikhil
prabhas

More Telugu News