Mahesh Babu: మహేశ్ బాబు అలా అనడాన్ని నేను ఎప్పటికీ మరిచిపోలేను: 'జబర్దస్త్' మహేశ్

షార్ట్స్‌లో చూడండి
'జబర్దస్త్' కామెడీ షో ద్వారా మంచి క్రేజ్ తెచ్చుకున్న ఆర్టిస్టులలో మహేశ్ ఒకరు. బక్కపలచగా .. పొడుగ్గా వుండి .. చిత్రమైన బాడీ లాంగ్వేజ్ తో ఆయన వేసే పంచ్ లకు అంతా నాన్ స్టాప్ గా నవ్వుతుంటారు. అలాంటి మహేశ్ కి 'రంగస్థలం' సినిమాతో మంచి పేరు వచ్చింది. ఈ నేపథ్యంలో "మీకు బాగా అనిపించిన కాంప్లిమెంట్ ఏది .. ఎవరిచ్చారు?" అనే ప్రశ్న ఫిల్మీ ఫోకస్ ఇంటర్వ్యూలో ఎదురైంది.

 అందుకు ఆయన స్పందిస్తూ .. "ఈ సినిమా తరువాత సుకుమార్ గారికి మహేశ్ బాబుగారు కాల్ చేసినప్పుడు నా గురించి అడిగారట. 'ఆ కుర్రాడు బాగా చేశాడు .. మీతో పాటు ఒకసారి తీసుకురండి' అన్నారట. అలాగే ఈ సినిమా నిర్మాతలు మహేశ్ బాబు గారిని కలిసినప్పుడు కూడా, ఆయన మళ్లీ నా విషయాన్ని గురించి ప్రస్తావించారట. అలా మహేశ్ బాబు నా నటనను మెచ్చుకోవడాన్ని నేను ఎప్పటికీ మరిచిపోలేను" అని చెప్పుకొచ్చాడు.    
Go Back to Shorts
Mahesh Babu

More Telugu News