దాడి చేయమని ఫ్యాన్స్‌ని పురిగొల్పడానికే పవన్ కల్యాణ్‌ ఆ ఫొటో పోస్ట్ చేశారా?: రామ్‌ గోపాల్‌ వర్మ
Add ap7am to your home Screen

దాడి చేయమని ఫ్యాన్స్‌ని పురిగొల్పడానికే పవన్ కల్యాణ్‌ ఆ ఫొటో పోస్ట్ చేశారా?: రామ్‌ గోపాల్‌ వర్మ

  • 'ఇది శ్రీని రాజు కొత్త లుక్‌' అంటూ పవన్ ట్వీట్
  • తప్పుబట్టిన వర్మ
  • క్రిమినల్‌లా మారు వేషంలో తిరుగుతున్నారా? అని ప్రశ్న
'ఇది శ్రీని రాజు కొత్త లుక్‌' అంటూ ఆయనకు సంబంధించిన ఓ ఫొటోను సినీనటుడు, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ తన ట్విట్టర్‌ ఖాతాలో పోస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ విషయంపై పవన్‌ కల్యాణ్‌ను దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తప్పుపట్టారు. శ్రీని రాజు లుక్‌ని బయట పెట్టడం వెనుక పీకే ఉద్దేశం ఏమిటని ప్రశ్నించారు.

శ్రీని రాజు క్రిమినల్‌లా మారు వేషంలో తిరుగుతున్నారని చెప్పడానికా? లేక ఆయనపై దాడి చేయమని తన ఫ్యాన్స్‌ ని పురిగొల్పడానికా? అని వర్మ ప్రశ్నించారు. కాగా, ఈ రోజు ఉదయం నుంచి పవన్ కల్యాణ్‌ ట్వీట్లు చేస్తోన్న విషయం విదితమే. ఆయన చేసిన ట్వీట్లలో శ్రీని రాజు పేరును పలుసార్లు ప్రస్తావించి, ఆయనకు సంబంధించిన ఫొటోలు కూడా పోస్ట్ చేశారు.  
RGV
Pawan Kalyan
Jana Sena

More Telugu News