Chandrababu: చంద్రబాబుకి ఈసారి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పను: కమలహాసన్‌ ట్వీట్

షార్ట్స్‌లో చూడండి
ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర ప్రభుత్వం చేస్తోన్న అన్యాయానికి వ్యతిరేకంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజయవాడలో 12 గంటల దీక్షకు దిగిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా చంద్రబాబుని ఉద్దేశిస్తూ సినీనటుడు కమలహాసన్‌ ట్వీట్ చేశారు. చంద్రబాబు తన పుట్టిన రోజున ఏపీ కోసం దీక్ష చేస్తున్నారని కమల్ గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో తాను ఎప్పుడూ ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పినట్లుగా ఇప్పుడు మాత్రం చెప్పలేనని, కానీ ఈ పోరాటంలో చంద్రబాబు విజయం సాధించాలని ఆశిస్తున్నానని అన్నారు.

మరోవైపు, చంద్రబాబు చేస్తోన్న దీక్షకు తెలుగు టీవీ ఆర్టిస్టులు మద్దతు తెలిపారు. కేంద్ర సర్కారుపై చేస్తోన్న పోరాటానికి తమ తోడ్పాటు అందిస్తామని టీవీ ఆర్టిస్ట్స్ అధ్యక్షుడు వినోద్‌ బాల చంద్రబాబు దీక్షా స్థలికి వచ్చి, ఆయనకు తెలిపారు.
Go Back to Shorts
Chandrababu
Kamal Haasan
Twitter

More Telugu News