ఫిలిం ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఇప్పుడు కొత్తగా వచ్చిందేమీ కాదు: కృష్ణంరాజు
- గతంలో కూడా క్యాస్టింగ్ కౌచ్ గురించి విన్నా
- చిన్న తప్పుకు మొత్తం వ్యవస్థను తప్పు పట్టవద్దు
- మోదీ దీక్షను విమర్శించిన చంద్రబాబు... ఇప్పుడు దీక్ష ఎలా చేస్తారు?
రాష్ట్రానికి అన్యాయం జరిగిందంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు దీక్ష చేపట్టడం విడ్డూరంగా ఉందని కృష్ణంరాజు అన్నారు. మోదీ దీక్ష చేసినప్పుడు విమర్శించిన చంద్రబాబు... ఇప్పుడు ఎలా దీక్ష చేస్తారని ప్రశ్నించారు. దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతోందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఏపీకి ఎంతో చేస్తోందని చెప్పారు. ప్రత్యేక ప్యాకేజీకి ఒప్పుకుని, ఇప్పుడు మాట మార్చడం దారుణమని అన్నారు. చంద్రబాబు పాలనలో రాష్ట్ర అప్పులు పెరిగిపోయాయని దుయ్యబట్టారు.