ఈ జీవితం ఇక చాలు: శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు

  • "ఇనఫ్ ఆఫ్ దిస్ లైఫ్" అంటూ పోస్టు
  • నిమిషాల్లో వైరల్ అయిన వ్యాఖ్య
  • నేను ఒంటరినన్న భావన కలుగుతోంది
  • శాంతి కావాలని ఉందన్న శ్రీరెడ్డి
టాలీవుడ్ క్యాస్టింగ్ కౌచ్ పై గళమెత్తి, సినీ పెద్దలు తనకు అన్యాయం చేశారని ఆరోపిస్తూ ఫిల్మ్ చాంబర్ ముందు అనూహ్య నిరసనలు తెలియజేసిన నటి శ్రీరెడ్డి, తన ఫేస్ బుక్ ఖాతాలో సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ జీవితం ఇక చాలనిపిస్తోందని ఆమె వ్యాఖ్యానించింది. ఈ ఉదయం 6 గంటల సమయంలో "ఇనఫ్ ఆఫ్ దిస్ లైఫ్" అంటూ పోస్టు పెట్టగా, అది నిమిషాల్లో వైరల్ అయింది. అంతకుముందు మరో పోస్టు పెడుతూ ఈ ప్రపంచంలో తొలిసారిగా తాను ఒంటరినన్న భావన కలుగుతోందని చెప్పింది. అలా చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలని చెప్పింది. తనకు శాంతి కావాలని ఉందని పేర్కొంది.

Go Back to Shorts
Sri reddy
Tollywood
Casting Couch
Film Chamber

More Telugu News