Andhra Pradesh: ఏపీలో రేపటి బంద్ కు వైసీపీ మద్దతు.. జగన్ పాదయాత్రకు ఒకరోజు విరామం!
ఏపీకి ప్రత్యేక హోదా సాధనలో భాగంగా ప్రత్యేక హోదా సాధన సమితి రేపు బంద్ తలపెట్టిన విషయం తెలిసిందే. రేపటి బంద్ కు వామపక్షాలు, కాంగ్రెస్, జనసేన పార్టీలు ఇప్పటికే మద్దతు ప్రకటించాయి. తాజాగా, వైసీపీ కూడా మద్దతు ప్రకటించింది. ఈ బంద్ లో వైసీపీ శ్రేణులు, నాయకులు పాల్గొననున్నారు. కాగా, బంద్ నేపథ్యంలో జగన్ తన పాదయాత్రకు రేపు విరామం ప్రకటించారు. ఈ విషయాన్ని వైసీపీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం తెలిపారు. కృష్ణా జిల్లా మైలవరం నియోజకవర్గంలోని ముత్యాలంపాడు శిబిరం వద్ద జగన్ బస చేయనున్నారు. ఎల్లుండి ఉదయం జగన్ తన పాదయాత్రను యథావిధిగా కొనసాగిస్తారు.