ఈ విలన్ కి హీరోగా మంచి పేరు రావాలి: ప్రభాస్
- అరుణ్ విజయ్ హీరోగా 'క్రైమ్ 23'
- మెడికల్ క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యం
- త్వరలో భారీస్థాయి విడుదల
తెలుగు వెర్షన్ కి సంబంధించిన ట్రైలర్ ను తాజాగా ప్రభాస్ చేతులమీదుగా రిలీజ్ చేయించారు. ఈ సందర్భంగా ప్రభాస్ మాట్లాడుతూ .. " అరుణ్ విజయ్ తో నాకు మంచి పరిచయముంది .. 'సాహో ' సినిమాలో ఆయన విలన్ గా నటిస్తున్నాడు. ఆయన హీరోగా చేసిన 'క్రైమ్ 23' ట్రైలర్ చూశాను .. చాలా బాగుంది. తమిళంలో సక్సెస్ అయిన ఈ సినిమా .. తెలుగులోను అరుణ్ విజయ్ కి మంచి పేరు తీసుకురావాలి .. నిర్మాతలకు మంచి పేరు రావాలి" అన్నాడు. మెడికల్ క్రైమ్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమా, త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.