అరుణ్ జైట్లీకి మూత్రపిండాల సమస్య.. త్వరలో శస్త్రచికిత్స?
- వెంటనే చేయాలని సూచించిన వైద్యులు
- ఎయిమ్స్ లో లేదంటే సింగపూర్ లో
- బయట తిరగొద్దని సూచన
65 ఏళ్ల వయసుల్లో ఉన్న జైట్లీకి మూత్రపిండాల మార్పిడి చికిత్స వెంటనే చేయాల్సి ఉందని వైద్యులు సూచించారు. వైద్యుల సూచన మేరకే ఆయన సోమవారం నుంచీ ఏ కార్యక్రమాల్లోనూ పాల్గొనకుండా ఇంటికే పరిమితమయ్యారు. దీర్ఘకాలంగా మధుమేహంతో బాధపడుతున్న జైట్లీ 2014లో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బరువు తగ్గే సర్జరీ (బేరియాట్రిక్) చేయించుకున్నారు. అప్పటి నుంచే ఆయనకు కిడ్నీ సంబంధిత సమస్యలు తలెత్తాయి.