హోదావల్ల ప్రజలకు కలిగే లాభాలేంటో తెలిస్తే కదా ప్యాకేజీయో, హోదాయో నిర్ణయించుకునేది!: సుమన్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

హోదావల్ల ప్రజలకు కలిగే లాభాలేంటో తెలిస్తే కదా ప్యాకేజీయో, హోదాయో నిర్ణయించుకునేది!: సుమన్

  • తెలంగాణకు మద్దతు పలికిన నటుల్లో మొదటి వ్యక్తిని నేనే
  • ప్రత్యేకహోదాకు నా మద్దతు
  • సినీ ప‌రిశ్ర‌మ‌కు ఏదైనా చేయాల‌ని కేసీఆర్ ను కోరతా  
'ప్ర‌త్యేక హోదా వ‌ల్ల ప్ర‌జ‌ల‌కు కలిగే లాభాలేంటో తెలియ‌జేస్తేనే క‌దా, వారికి ప్ర‌త్యేక హోదా కావాలో.. ప్ర‌త్యేక ప్యాకేజీ కావాలో నిర్ణ‌యం తీసుకునేది' అంటూ సినీ నటుడు సుమన్ వ్యాఖ్యానించారు. 'సత్య గ్యాంగ్‌’ సినిమా ప్రమోషన్ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ ఉద్య‌మానికి మద్దతు ప‌లికిన న‌టుల్లో తానే మొద‌టివాడినన్నారు. తాను హైద‌రాబాద్ వ‌చ్చి 29 ఏళ్ల‌వుతోందని ఆయన చెప్పారు. సీఎం కేసీఆర్ చేస్తున్న మంచి ప‌నులు, తెలంగాణ అభివృద్ధి తనను ఆక‌ట్టుకున్నాయని సుమన్ తెలిపారు.

తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌కు ఏదైనా చేయాల‌ని ఆయనను కోరతానని ఆయన చెప్పారు. ఆంధ్రప్రదేశ్ కు ప్ర‌త్యేక హోదాకు తన మద్దతు ఉంటుందని ఆయన అన్నారు. స్పెష‌ల్ ప్యాకేజ్ కు మద్దతు తెలిపిన స‌మ‌యంలో మోదీతో చంద్ర‌బాబుగారే మాట్లాడారని గుర్తు చేసిన ఆయన, మళ్లీ ఇప్పుడు ఆయనే ప్ర‌త్యేక హోదా కావాలంటున్నారని ఆరోపించారు. ప్ర‌త్యేక హోదా వ‌ల్ల ప్ర‌జ‌ల‌కు కలిగే లాభాలేంటో తెలియ‌జేస్తేనే క‌దా, వారికి ప్ర‌త్యేక హోదా కావాలో, ప్ర‌త్యేక ప్యాకేజీ కావాలో నిర్ణ‌యం తీసుకునేదని సుమన్ వ్యాఖ్యానించారు.
suman
Telangana
actor

More Telugu News