వైసీపీ నేతలు అచ్చోసిన ఆంబోతుల్లా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు : మంత్రి దేవినేని
Add ap7am to your home Screen

వైసీపీ నేతలు అచ్చోసిన ఆంబోతుల్లా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు : మంత్రి దేవినేని

  • విజయసాయిరెడ్డి బుద్ధి, జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారు
  • వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాకుండా జీతాలు తీసుకుంటున్నారు
  • దొంగే మమ్మల్ని దొంగలనడమేంటి?
వైసీపీ నేతలు అచ్చోసిన ఆంబోతుల్లా తమ ఇష్టానుసారం మాట్లాడుతున్నారని ఏపీ మంత్రి దేవినేని ఉమ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రంలో అవినీతి జరిగిందని, సీబీఐతో విచారణ జరిపించాలంటూ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి బుద్ధి, జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

ప్రధాని మోదీని తిడితే విజయసాయిరెడ్డి నోటీసులివ్వడమేంటి? అసలు, సభా సాంప్రదాయాలు విజయసాయిరెడ్డికి తెలుసా? అని ప్రశ్నించారు. వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాకుండా జీతాలు తీసుకుంటున్నారని, మార్నింగ్ వాక్, ఈవినింగ్ వాక్ చేసుకుంటున్నారని విమర్శించారు. షెల్ కంపెనీలు పెట్టి దోచుకున్న దొంగ తమను దొంగలనడమేంటని దేవినేని ఆగ్రహం వ్యక్తం చేశారు. 
devineni
Vijay Sai Reddy

More Telugu News