తన పూర్వీకుల ఇంటి వద్ద కంటతడి పెట్టిన మలాలా!

షార్ట్స్‌లో చూడండి
నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మలాలా యూసఫ్ జాయ్ ప్రస్తుతం పాకిస్థాన్‌లో నాలుగు రోజుల పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఆమె ఈ రోజు తన సొంత పట్టణమైన స్వాత్ లోయలోని మింగోరా వచ్చి అక్కడి తన పూర్వీకుల ఇంటిని సందర్శించి, భావోద్వేగానికి గురై కన్నీరు పెట్టుకుంది. కాసేపట్లో ఆమె తాను చదువుకున్న పాఠశాలను సందర్శించనుంది. కాగా, ఆమె తాజాగా మాట్లాడుతూ బ్రిటన్‌లో తన చదువు పూర్తికాగానే తాను మళ్లీ పాకిస్థాన్ కు వచ్చేస్తానని చెప్పింది.

పాక్‌లో మహిళా విద్య కోసం తన ప్రచారాన్ని, పోరాటాన్ని కొనసాగిస్తానని మలాలా తెలిపింది. ఈ పర్యటనలో మలాలాతో పాటు ఆమె తల్లిదండ్రులు కూడా ఉన్నారు. మలాలా పర్యటన సందర్భంగా పోలీసులు కట్టుదిట్టమైన భద్రత కల్పించారు.
Go Back to Shorts
malala
Pakistan
tears

More Telugu News