Hyderabad: కూకట్ పల్లిలో భార్యను హతమార్చిన భర్త

షార్ట్స్‌లో చూడండి
భార్యను గొంతు నులిమి హతమార్చిన ఘటన హైదరాబాదులోని కూకట్‌ పల్లిలో చోటుచేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే.. నల్గొండ జిల్లా మల్లేపల్లి గ్రామానికి చెందిన శ్రీను కూకట్ పల్లి హౌసింగ్ బోర్డు పోలీస్ స్టేషన్ పరిధిలోని మూసాపేట్ రాఘవేంద్ర సొసైటీలో భార్య దేవి, ఇద్దరు పిల్లలతో నివాసముంటున్నాడు. శ్రీను పంజాగుట్టలోని డ్రై క్లీనింగ్ దుకాణంలో ఉద్యోగం చేస్తున్నాడు.

ఇదిలా వుండగా, దేవి తల్లి స్వగ్రామంలో భూమిని విక్రయించింది. దీనిపై భార్యాభర్తల మధ్య చర్చ సందర్భంగా వాగ్వాదం చోటుచేసుకుంది. అర్థరాత్రి వివాదం తారస్థాయికి చేరడంతో తీవ్ర ఆగ్రహానికి గురైన శ్రీను, భార్యను గొంతునులిమి హత్య చేశాడు. అనంతరం పోలీస్‌ స్టేషన్‌ కు వెళ్లి లొంగిపోయాడు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు ప్రారంభించారు. దేవి మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు.
Go Back to Shorts
Hyderabad
kphb
Nalgonda District

More Telugu News