శంషాబాద్‌ విమానాశ్రయంలో విమాన రాకపోకలకు ఆటంకం
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

శంషాబాద్‌ విమానాశ్రయంలో విమాన రాకపోకలకు ఆటంకం

  • ఇండిగో విమానం ల్యాండింగ్‌ సమయంలో పేలిపోయిన టైర్‌
  • ఇంకా రన్‌వే పైనే ఆ విమానం
  • రన్‌వేను క్లియర్‌ చేసి సర్వీసులు పునరుద్ధరిస్తామన్న అధికారులు
హైద‌రాబాద్ శివారు శంషాబాద్‌లోని రాజీవ్‌ గాంధీ విమానాశ్రయంలో నిన్న రాత్రి తిరుపతి నుంచి హైదరాబాద్‌ వచ్చిన ఇండిగో విమానం ల్యాండింగ్‌ సమయంలో టైర్‌ పేలిపోయిన విషయం విదితమే. దీంతో మంటలు వ్యాపించి, రన్‌వే పైనే ఆ విమానం నిలిచిపోయింది. దీంతో ఈ రోజు విమానాశ్రయంలో విమాన రాకపోకలు నిలిచిపోయిన‌ట్లు తెలిపిన అధికారులు... రన్‌వేను క్లియర్‌ చేసి వీలైనంత త్వ‌ర‌లో సర్వీసులు పునరుద్ధరిస్తామని ప్ర‌క‌టించారు. కాగా, నిన్న రాత్రి తిరుపతి నుంచి వచ్చిన ఈ విమానంలో వైసీపీ ఎమ్మెల్యే రోజా సహా 70 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడిన విషయం తెలిసిందే. 
airport
roja
Hyderabad

More Telugu News