Allu Arjun: 15 వసంతాల ప్రయాణాన్ని పూర్తి చేసిన స్టైలీష్ స్టార్

షార్ట్స్‌లో చూడండి
తెలుగు తెరపై విభిన్నమైన కథలతో .. విలక్షణమైన పాత్రలతో దూసుకుపోతోన్న కథానాయకుడిగా అల్లు అర్జున్ కనిపిస్తాడు. నూనూగు మీసాలతో 'గంగోత్రి' సినిమాలో అమాయకంగా కనిపించిన అల్లు అర్జున్ .. స్టైలీష్ స్టార్ గా ఎదగడానికి ఎంతోకాలం పట్టలేదు. దాని వెనుక ఆయన కృషి .. పట్టుదల స్పష్టంగా కనిపిస్తాయి.

హీరోగా ఆయన తొలిచిత్రమైన 'గంగోత్రి' విడుదలై నిన్నటికి 15 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఆ సినిమాతో పరుగును మొదలుపెట్టిన అల్లు అర్జున్ .. ఈ 15 యేళ్లలో ఎన్నో మైలురాళ్లను దాటేశాడు. డాన్స్ లో తనకి సాటిలేదనిపించుకున్నాడు. తాను ఈ స్థాయికి చేరుకోవడానికి మొదటి సినిమాతో పునాది వేసిన తన తండ్రికీ .. దర్శకుడు రాఘవేంద్రరావుకి .. నిర్మాత అశ్వనీదత్ కి కృతజ్ఞతలు తెలిపాడు. తనని ప్రోత్సహిస్తూ ముందుకు నడిపిస్తోన్న ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలియజేశాడు. 
Go Back to Shorts
Allu Arjun

More Telugu News