వంగి వంగి దండాలు పెట్టడంలో చంద్రబాబు సిద్ధహస్తుడు : ఎమ్మెల్యే రోజా
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

వంగి వంగి దండాలు పెట్టడంలో చంద్రబాబు సిద్ధహస్తుడు : ఎమ్మెల్యే రోజా

  • సోనియా గాంధీ, చిదంబరానికి చంద్రబాబు దండాలు పెట్టారు 
  • అలా చేసే జగన్ పై కేసులు పెట్టించారు
  • మోదీకి, పవన్ కు దండాలు పెట్టి  అధికారం దక్కించుకున్నారు 
సీఎం చంద్రబాబునాయుడుపై వైసీపీ ఎమ్మెల్యే రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు ఆమె మీడియాతో మాట్లాడుతూ, వంగి వంగి దండాలు పెట్టడంలో చంద్రబాబు సిద్ధహస్తుడని, సోనియా గాంధీ, చిదంబరానికి నాడు దండాలు పెట్టిన చంద్రబాబు జగన్ పై కేసులు పెట్టించారని విమర్శించారు. ప్రధాని నరేంద్ర మోదీకి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ దండం పెట్టి చంద్రబాబు అధికారం చేజిక్కించుకున్నారని అన్నారు. ‘అవినీతి నాయకులకు అధిపతి నువ్వు. ప్రత్యేక హోదా దృష్టి మళ్లించేందుకే నువ్వు, నీ అనుచరులు విజయసాయిరెడ్డిపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు’ అని చంద్రబాబుపై రోజా తీవ్ర ఆరోపణలు చేశారు.
Chandrababu
roja
YSRCP

More Telugu News