విజయసాయిరెడ్డి చాలా తప్పుడు భాష వాడారు : సుజనా చౌదరి
- చంద్రబాబునాయుడుపై మాట్లాడిన తీరు చాలా బాధాకరం
- సభ్య సమాజం తలదించుకునేలా ఆయన మాట్లాడారు
- మీడియా ద్వారా విజయసాయిరెడ్డి క్షమాపణలు చెప్పాలి
- ఢిల్లీలో విలేకరుల సమావేశంలో సుజనా చౌదరి
అసలు, భావి తరాలకు అసలు ఏం తెలియపరుస్తున్నారు? ఆయనకీ భార్యాపిల్లలు ఉన్నారు కదా, వాళ్లు వినే విధంగానే ఆయన మాట్లాడారా? ఈ విధంగా ఉంటే రాజకీయాలకు ఎక్కడికెళుతున్నాయనే విషయాన్ని మనందరం కూడా ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. భారతదేశంలో ఎన్ని రాజకీయ పార్టీలైనా ఉండొచ్చు, పార్లమెంట్ లోకి ఎవరైనా అడుగుపెట్టొచ్చు కానీ, పార్లమెంట్ పరువు తీసేలా వ్యవహరించకూడదు. విజయసాయిరెడ్డి చాలా తప్పుడు భాష వాడారు. ఇప్పటికైనా తన తప్పు తెలుసుకుని, మీడియా ద్వారా విజయసాయిరెడ్డి క్షమాపణ చెబితే మంచిది’ అని సుజనా చౌదరి హితవు పలికారు.