Chandrababu: ఇరవై తొమ్మిది సార్లు ఢిల్లీకి వెళ్లానంటున్న చంద్రబాబు ఏం సాధించారు? : వైసీపీ నేత పార్థసారధి

షార్ట్స్‌లో చూడండి
ఇరవై తొమ్మిది సార్లు ఢిల్లీకి వెళ్లానని చెప్పుకుంటున్న సీఎం చంద్రబాబునాయుడు ఏపీకి ఏం సాధించారని వైసీపీ అధికార ప్రతినిధి పార్థసారధి ప్రశ్నించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, కేంద్రానికి రాసిన ఏ లేఖ లోనూ ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వాలని చంద్రబాబు కోరలేదని, ఆస్కార్ నటీనటుల కంటే చంద్రబాబు, ఆయన మంత్రులు చాలా బాగా నటిస్తున్నారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. దేశంలోని సీనియర్ నేతల్లో తాను కూడా ఒకరినని చెప్పుకుంటున్న చంద్రబాబును ప్రజలు నమ్మే పరిస్థితి లేదని, అందుకే, ఏపీ కోసం పోరాడుతున్నట్టు ఆయన నటిస్తున్నారని విమర్శించారు. ఈశాన్య రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇచ్చారని, ఏపీకి ఎందుకివ్వరంటూ కేంద్రాన్ని చంద్రబాబు ఇప్పుడా ప్రశ్నించేందని వ్యాఖ్యానించారు.
Go Back to Shorts
Chandrababu
YSRCP
partha sarathi

More Telugu News