ఆర్టిస్టులకు మా నాన్న డబ్బులు ఆపుతారనడంలో నిజంలేదు: ఏడిద శ్రీరామ్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఆర్టిస్టులకు మా నాన్న డబ్బులు ఆపుతారనడంలో నిజంలేదు: ఏడిద శ్రీరామ్

  • చిన్నవాళ్లందరికీ ముందుగానే డబ్బులు ఇచ్చేవారు 
  • పెద్దవాళ్లందరికీ రిలీజ్ కి ముందు ఇచ్చేవారు 
  • ఆయనకి కష్టం విలువ తెలుసు    
తెలుగు తెరకి ఆణిముత్యాల్లాంటి చిత్రాలను అందించిన నిర్మాతగా ఏడిద నాగేశ్వరరావును చెప్పుకోవచ్చు. సంగీత .. సాహిత్య .. నాట్యం ప్రధానంగా గల కళాత్మక చిత్రాలను ఆయన నిర్మించారు. "అలాంటి ఆయన ఆర్తిస్తులకి ఎంతోకొంత ఎమౌంట్ ఇవ్వకుండా ఆపుతారనే విమర్శ వుంది .. దీనికి మీరేమంటారు"? అనే ప్రశ్న ఏడిద శ్రీరామ్ కి ఐ డ్రీమ్స్ ఇంటర్వ్యూలో ఎదురైంది.

అందుకాయన స్పందిస్తూ .. "మా నాన్న కష్టపడి పైకి రావడం వలన .. ఎదుటివారి కష్టాలను అర్థం చేసుకునేవారు. చిన్న చిన్న ఆర్టిస్టులకు .. టెక్నీషియన్లకు ముందుగా ఎమౌంట్ ఇచ్చేవారు. పెద్దవాళ్లకి మాత్రం రిలీజ్ కి ముందుగా ఇస్తానని చెప్పేవారు. ఇప్పటికీ మా ప్రొడక్షన్ ఫుడ్ గురించి .. ట్రీట్మెంట్ గురించి .. పేమెంట్ గురించి గొప్పగా చెప్పుకుంటారు. ఎవరికైనా సరే ఎంతకైతే ముందుగా మాట్లాడేవారో .. ఆ మొత్తం రిలీజ్ కి ముందే ముట్టజెప్పేవారు. ఆయన డబ్బులు ఆపుతారనేది కేవలం పుకారు మాత్రమే" అని స్పష్టం చేశారు.     
edida sriram

More Telugu News