నాగం బాటలో నాగర్‌కర్నూలు బీజేపీ జిల్లా అధ్యక్షుడు.. పార్టీకి గుడ్‌బై
- పార్టీ జిల్లా అధ్యక్ష పదవికి శశిధర్ రెడ్డి రాజీనామా
- కాంగ్రెస్‌లో చేరనున్న నాగం, శశిధర్?
- జోరందుకున్న ఊహాగానాలు
బీజేపీ నుంచి బయటకు వచ్చిన నాగం కాంగ్రెస్‌లో చేరుతారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇటీవల ఆయన ఢిల్లీలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీని కలిసినట్టు వార్తలు వచ్చాయి. పూర్వ మహబూబ్‌నగర్ జిల్లాకే చెందిన రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరి కీలక పాత్ర పోషిస్తుండడంతో నాగం కూడా కాంగ్రెస్ గూటికే చేరాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. కాగా, నాగర్ కర్నూలు జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన శశిధర్ రెడ్డి కూడా నాగం వెంటే నడిచే అవకాశం ఉందని సమాచారం.