Pawan Kalyan: అందుకే, ఏపీలో బీజేపీ బాగా బలహీనపడింది : పవన్ కల్యాణ్

షార్ట్స్‌లో చూడండి
ఏపీలో ప్రస్తుత పరిస్థితులు మారిపోవడంతో, ప్రజల అభిప్రాయం మరో రకంగా ఉందని, అందుకే, ఇక్కడ బీజేపీ బలహీనపడిందని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ విమర్శించారు. ఎన్డీటీవీకి ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో పవన్ మాట్లాడుతూ, ప్రధాని నరేంద్ర మోదీ అంటే వ్యక్తిగతంగా తనకు ఇష్టమని తన మనసులో మాట బయటపెట్టారు. ప్రజల కోసం, ప్రజా సమస్యలపై తాను పోరాడతానని అన్నారు.

మరోపక్క, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై, మంత్రి లోకేశ్ పై పవన్ ఆరోపణల నేపథ్యంలో ఆయనపై టీడీపీ నేతలు మండిపడుతున్న విషయం తెలిసిందే. ఇన్నాళ్లూ నోరుమెదపని పవన్ కల్యాణ్, ఉన్నపళంగా ఆరోపణలు చేయడానికి కారణం బీజేపీతో ఆయన ములాఖత్ అయ్యారని విమర్శలు గుప్పిస్తున్నారు.
Go Back to Shorts
Pawan Kalyan
bjp

More Telugu News