చంద్రబాబు, లోకేశ్ పై వచ్చిన అవినీతి ఆరోపణలపై సీబీఐ విచారణ జరపాలి : ఎమ్మెల్యే రోజా
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

చంద్రబాబు, లోకేశ్ పై వచ్చిన అవినీతి ఆరోపణలపై సీబీఐ విచారణ జరపాలి : ఎమ్మెల్యే రోజా

  • ‘అవిశ్వాసం’పై  చర్చ జరగకుండా చంద్రబాబు కుట్ర
  • ప్రత్యేక హోదా సాధించే వరకు మా పోరాటం ఆగదు
  • అవిశ్వాసానికి మద్దతు తెలిపిన పార్టీలు బీజేపీకి కొమ్ముకాస్తున్నాయి : రోజా
నారా చంద్రబాబు, లోకేశ్ పై వచ్చిన అవినీతి ఆరోపణలపై సీబీఐ విచారణ జరపాలని వైసీపీ ఎమ్మెల్యే రోజా డిమాండ్ చేశారు. ఈరోజు ఆమె మీడియాతో మాట్లాడుతూ, ఏపీకి అన్యాయం చేసిన కేంద్రంపై అవిశ్వాస తీర్మానానికి మద్దతు తెలిపిన పార్టీలు బీజేపీకి కొమ్ముకాస్తున్నాయని విమర్శించారు. అవిశ్వాసం తీర్మానంపై లోక్ సభలో చర్చ జరగకుండా ఉండేందుకు చంద్రబాబు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు.

కాగా, ప్రత్యేక హోదా తోనే ఏపీ అభివృద్ధి సాధ్యమని వైసీపీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి అన్నారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రత్యేకహోదా సంజీవిని కాదన్న చంద్రబాబు నాడు ప్రత్యేక ప్యాకేజ్ కావాలని అడిగారని అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా సాధన నిమిత్తం వైఎస్ జగన్ చేస్తున్న పోరాటానికి వస్తున్న ప్రజాదరణను చూసి, ఇప్పుడు చంద్రబాబు యూటర్న్ తీసుకున్నారని విమర్శించారు. ప్రత్యేక హోదా సాధించే వరకూ పోరాటం కొనసాగిస్తామని అన్నారు.
Chandrababu
roja

More Telugu News